పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మరో 20 ఏండ్లు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహబూబ్ నగర్ పట్టణాన్ని మోడల్ ప్లాన్డ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

మహబూబ్‌నగర్ : మరో 20 ఏండ్లు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహబూబ్ నగర్ పట్టణాన్ని మోడల్ ప్లాన్డ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నామన్నారు. ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్ పట్టణం హైదరాబాద్ నగరానికి సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నది.
ఈ నేపథ్యంలో పట్టణాన్ని సుందరంగా, ప్లాన్డ్ సిటీగా తీర్చిదిద్దేందుకు వచ్చే 20 ఏండ్లకు అవసరమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశంలోనే మోడల్ ప్లాన్డ్ సిటీగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.
మహబూబ్ నగర్ పట్టణాన్ని జాతీయ రహదారులకు అనుసంధానిస్తూ రోడ్లు, కమర్షియల్ సెంటర్లు, రెసిడెన్షియల్ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్లు, బైపాస్ రోడ్డు, నూతనంగా నిర్మించనున్న బైపాస్ రోడ్డు ఏర్పాటుతో పాటు, మహబూబ్ నగర్ ను అద్భుతమైన ప్లాన్డ్ సిటీ గా తీర్చిదిద్దేందుకు తగిన ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు.
సమావేశంలో ఆర్వీ అసోసియేట్ అధికారులు, టీమ్ లీడర్ పళని, అర్బన్ ప్లానర్ శేఖర్ గౌడ్, అర్బన్ ప్లానర్ కె. ప్రత్యూష పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

