గురువారం 22 అక్టోబర్ 2020
Jangaon - Sep 27, 2020 , 06:24:41

బంగారు చేప

బంగారు చేప

జనగామ రూరల్‌ : చాలాకాలం తర్వాత మండలంలోని పెంబర్తి గ్రామంలోని పెద్ద చెరువు నిండి మత్తడి పోస్తున్నది. చెరువులోని చేపలు ఎదురెక్కుతున్నాయి. దీంతో మత్స్య కారులు చేపల వేటలో బిజీగా ఉన్నారు. కాగా, శనివారం చెరువులో బంగారు వర్ణం చేప దొరకడంతో పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డికి అందజేశారు. ఇప్పటివరకు ఇలాంటి చేపను ఈ చెరువులో చూడలేదని మత్స్యకా రులు, గ్రామస్తులు చెబుతున్నారు. logo