మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jul 31, 2020 , 01:08:26

రిటైర్డ్‌ టీచర్‌ ఇంట్లో దొంగతనం

రిటైర్డ్‌ టీచర్‌ ఇంట్లో దొంగతనం

జనగామ క్రైం : జిల్లా కేంద్రంలోని బృందావనం కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ టీచర్‌ ఇంట్లో చోరీ జరిగినట్లు జనగామ పోలీసులు తెలిపారు. సీఐ మల్లేశ్‌యాదవ్‌ తెలిపిన కథనం ప్రకారం..జనగామ జిల్లా కేంద్రంలోని బృందావనం కాలనీలో రిటైర్డ్‌ టీచర్‌ నట్వా ప్రభాకర్‌-స్వరూపారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈనెల 26న రాత్రి వారి బంధువు మరణించడంతో జనగామ నుంచి హన్మకొండకు బయలుదేరి వెళ్లారు.

27న ఉదయం 7 గంటల సమయంలో ప్రభాకర్‌ బంధువు బుక్క ప్రవీణ్‌ కుమార్‌ జనగామకు వచ్చి  బట్టలు తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లాడు. గురువారం ప్రభాకర్‌ దంపతులు తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగులగొట్టి కనిపించింది. ఇంట్లో ఉన్న బీరువాలోని బట్టలు చిందరవందరగా పడేసి, 1.5 తులాల బంగారం, 2.370 అమెరికా డాలర్లు, ఫాజిల్‌ అమెరికన్‌ వాచీలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనగామ ఎస్సై సీహెచ్‌ రవి కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

VIDEOS

logo