జగిత్యాల : జిల్లాలోని మల్లాపూర్ మండలం రాఘవపేట కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ జి. రవి పరిశీలించారు. 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరూ వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇంటింటికి తిరిగి సర్వే చేసి, వ్యాక్సిన్ తీసుకున్నది లేనిది వివరాలు సేకరించాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కులు ధరించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట కోరుట్ల ఆర్డీఓ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.