e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home జగిత్యాల ఆందోళన వద్దు మేమున్నాం

ఆందోళన వద్దు మేమున్నాం

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కలెక్టర్‌, ఎస్పీ..
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన

జగిత్యాల/మెట్‌పల్లి/ధర్మపురి, జూలై 23 ;మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. శుక్రవారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు ‘మేమున్నా’మని భరోసా ఇచ్చారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వగా.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ జగిత్యాల, సారంగాపూర్‌ మండలం, రాయికల్‌లో పర్యటించి బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ రామన్నపేట, గొల్లపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఆయాచోట్ల బాధితుల సమస్యలను తెలుసుకొని, ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇటు కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధూ శర్మ గోదావరి తీర ప్రాంతాల్లో వరద ఉధృతిని పరిశీలించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

అధైర్యపడవద్దు: ఎమ్మెల్యే సంజయ్‌
జగిత్యాల, జూలై 23: వర్షాలకు అధైర్యపడవద్దని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ భరోసా ఇచ్చా రు. జగిత్యాల పట్టణంలోని 6వ వార్డు బేడ బుడిగ జంగాల కాలనీని ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. వర్షానికి పూర్తిగా నీట మునగడంతో ప్రభుత్వం తరఫున 50మంది నిరుపేదలకు నిత్యావసరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పూరి గుడిసెల్లో నివాసముంటున్న దళితులందరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520 డబుల్‌ బెడ్రూం ఇండ్లలో 700 ఇండ్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వారనాసి మల్లవ్వ తిరుమలయ్య, కప్పల శ్రీకాంత్‌, వైద్యులు రాచకొండ శ్రీనివాస్‌, నాగరత్న, తహసీల్దార్‌ వెంకటేశ్‌, డీటీ రాజేంద్రప్రసాద్‌, ఆర్‌ఐ ఖాజీం అలీ, భాస్కర్‌, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

దాతల సేవలు అభినందనీయం
రాయికల్‌ రూరల్‌, జూలై 23: పేదలకు సేవ చేసేందుకు పలువురు దాతలు ముందుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాయికల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో 50 మందికి పైగా వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆపద సమయంలో పేదలను ఆదుకునేందుకు ముందు కు వచ్చిన మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, తహసీల్దార్‌ మహేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ను అభినందించారు. ప్రకృతి వైపరీత్యాలను ఆత్మైస్థ్యెర్యంతో ఎదుర్కోవాలని సూచించా రు. అధికారుల ముందు చూపు, ప్రజల సహకా రంతో జగిత్యాల నియోజకవర్గంలో అతి స్వల్పం గా నష్టం జరిగిందన్నారు. నియోజకవర్గంలో వరద తాకిడికి నష్టం జరిగిన ప్రాంతాలను వెంట నే మరమ్మతు చేపట్టడానికి అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ గండ్ర రమాదేవి, నాయకులు పిపోజి మహేందర్‌ బా బు, ఇంతియాజ్‌, ముబిన్‌, కొత్తపెల్లి ప్రసాద్‌, హూస్సేన్‌, ఎలిగేటి అనిల్‌, మోర రామ్మూర్తి, మ హేందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి
సారంగాపూర్‌, జూలై 23: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం బీర్‌పూర్‌ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును, కమ్మునూర్‌-కలమడుగు బ్రిడ్జి వద్ద గోదావరి వదర ప్రవాహాన్ని, వ్యవసాయ క్షేత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి వరద నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ, రోళ్లవాగు ప్రాజెక్టు ఎప్పుడూ లేనివిధంగా 0.35 టీఎంసీలకు పూర్తిగా నిండిందని అన్నారు. ఎప్పడూ 0.25 టీఎంసీ దాటలేదని, ఆధునీకరణ పనులు పూర్తి కాకముందే 30శాతం అదనంగా నీళ్లు నిల్వ ఉన్నాయని తెలిపారు. బుగ్గచెరువు తూం నుంచి కమ్మునూర్‌ వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని, ప్రాజెక్టు పాత తూంల వద్ద కొత్తతూంలు ఏర్పాటు చేయడంతో ఆయా గ్రామాలకు పుష్కలంగా నీళ్లు వస్తాయన్నారు. కమ్మునూర్‌ వద్ద గోదావవరి ప్రవాహం గురువారం డేంజర్‌ లెవల్‌ వరకు వచ్చిందని తెలియడంతో అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు రాత్రంతా ఇక్కడే ఉండి పర్యవేక్షించారని అన్నారు. సుమారు 200ఎకరాల్లో పంటనష్టం జరిగిందని చెప్పారు. కార్యక్రమాల్లో కేడీసీసీబీ డైరెక్టర్‌ ముప్పాల రాంచందర్‌ రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొల్ముల రమణ, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ ఆరిఫొద్దీన్‌, ఎస్సారెస్సీ డీఈ చక్రునాయక్‌, ఎంపీడీవో మల్లారెడ్డి, ఎస్‌ఐలు అనిల్‌, కిరణ్‌కుమార్‌, మధులత, రజిత, ప్రజాప్రతినిధులు, నాయకులు బందెల మరియా, ఢిల్లీ రామారావు, మేసు ఏసుదాసు, హరీశ్‌, ముక్క వెంకటేశ్‌ యాదవ్‌, ఆడెపు రవి, బందెల రాజేశం, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే, జడ్పీ అధ్యక్షురాలు పరిశీలన
మెట్‌పల్లి, మెట్‌పల్లి టౌన్‌/ జూలై 23: పట్టణ శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న వట్టి వాగును, వాగు తీరంలోని మహాలక్ష్మీ, పోలేరమ్మ ఆలయాలను శుక్రవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత పరిశీలించారు. వరద నీరు ఆలయాల మెట్లవరకు చేరడంతో పోలేరమ్మ ఆలయం వద్దగల విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది. వెంటనే మరమ్మతులు చేయించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్‌ ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. వచ్చే నెలలో పోలేరమ్మ ఆలయానికి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహాలక్ష్మీ, పోలేరమ్మ ఆలయాల్లో ఎమ్మెల్యే, జడ్పీ అధ్యక్షురాలు ప్రత్యేక పూజలు చేశారు. వీరివెంట మున్సిపల్‌ అధ్యక్షురాలు రాణవేని సుజాత, కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్లు మర్రి సహదేవ్‌, పురుషోత్తం, కిశోర్‌, మున్సిపల్‌ మాజీ ఉపాధ్యక్షుడు మార్గం గంగాధర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ నాగభూషణ్‌, మాజీ సర్పంచ్‌ పూదరి నర్సాగౌడ్‌, సింహాద్రి, లక్ష్మణ్‌, సంజీవ్‌, అశోక్‌, ప్రవీణ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మెట్‌పల్లి రూరల్‌, జూలై 23: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు. భారీ వర్షాలకు కూలిపోయిన మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో జడ్పీహెచ్‌ఎస్‌ స్టాఫ్‌రూమ్‌, పీర్ల మసీదును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జడ్పీహెచ్‌ఎస్‌ స్టాఫ్‌ రూమ్‌కు జిల్లా పరిషత్‌ నిధుల నుంచి రూ.12 లక్షలు, పీర్ల మసీదుకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేయిస్తామని తెలిపారు. వీటి పునరుద్ధరణ పనులను సైతం వెంటనే ప్రారంభించేలా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం రాజేశ్వర్‌రావుపేటలో కోతకు గురైన ఆగ చెరువుకు వెళ్లే రోడ్డు, వైకుంఠధామం రోడ్డులను పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించేలా చూస్తామని తెలిపారు. వీరి వెంట ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఎంపీడీవో భీమేశ్‌, ఏపీవో మహేశ్వర్‌, సర్పంచ్‌ కాట శ్రీధర్‌, ఎంపీటీసీ నోముల గంగాధర్‌, నాయకులు పుల్ల జగన్‌గౌడ్‌, ముదాం నర్సింహులు, బద్దం రాజేశ్‌, డాకూరి వెంకటేశ్‌, వేంగంటి లక్ష్మణ్‌గౌడ్‌ తదితరులున్నారు.

ఇబ్రహీంపట్నం మండలంలో
ఇబ్రహీంపట్నం, జూలై 23: ఎర్దండి, కోమటికొండాపూర్‌, వర్షకొండ తదితర గ్రామాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు ఉండడంతో గోదావరి నది వెంట ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. వర్షకొండలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాక్షికంగా కూలిన ఇల్లును పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ జాజాల భీమేశ్వరి, మెట్‌పెల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఇబ్రహీంపట్నం వైస్‌ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పొన్‌కంటి వెంకట్‌, డిప్యూటీ తహసీల్దార్‌ పద్మ, సర్పంచులు లక్షణ్‌, శ్రీనివాస్‌, ఎంపీటీసీలు చిన్నారెడ్డి, రాములు, సింగిల్‌ విండో చైర్మన్‌ బద్దం గోపి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎల్లాల దశరథ రెడ్డి, నాయకులు జేడీ సుమన్‌, నేమూరి సత్యనారాయణ, జిల్లాల పవన్‌, రాజన్న, తుకారాం, జగన్‌రావు, గంగాధర్‌, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

మల్లాపూర్‌ మండలంలో పరిశీలన
మారుతీనగర్‌, జూలై 23: మల్లాపూర్‌ మండలంలోని చిట్టాపూర్‌, రేగుంట, సాతారం, గొర్రెపల్లి, మల్లాపూర్‌ గ్రామాల్లో రోడ్లను, పంట పొలాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌ అధ్యక్షుడు కొమ్ముల జీవన్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు కదుర్క నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

మల్యాల మండలంలో ఎమ్మెల్యే సుంకె
మల్యాల, జూలై 23: రామన్నపేట, గొల్లపల్లె గ్రామాల్లోని వరదనీటిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పరిశీలించారు. రామన్నపేటలో కొట్టుకుపోయిన రోడ్డు మరమ్మతుకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు వెంటనే అంచనా వ్యయాన్ని తయారుచేయాలని డీఈని ఫోన్‌లో ఆదేశించారు. గొల్లపల్లె గ్రామంలో ప్రధాన కూడలిలో వర్షపు నీటితో గ్రామంలో రాకపోకలు స్తంభించడంతో వెంటనే ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించి పనులు చేపట్టేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలని, ప్రభుత్వపరంగా వెంటనే నిధులు మంజూ రు చేయిస్తానని ఎమ్మెల్యే రవిశంకర్‌ ఇరిగేషన్‌ అధికారులకు ఫోన్‌లో సూచించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు మోత్కు యాదమ్మ, గడ్డం మల్లారెడ్డి, కొమురయ్య, తదితరులున్నారు.

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌
ధర్మపురి, జూలై 23: అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రవి ఆదేశించారు. జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాలైన ధర్మపురి, కోటిలింగాలలో శుక్రవారం కలెక్టర్‌ పర్యటించి గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించారు. జిల్లాలోని 6 నదీ పరీవాహక మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి ఉధృతి పెరగడంతో నీట మునిగిన బ్రిడ్జిలు, రోడ్డు మార్గాలను మూసివేశామన్నారు. ఆ ప్రాంతాల్లో ఎవరూ ప్రయాణం చేయడం, చేపల వేటకు వెళ్లడం లాంటివి చేయకుండా అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసి బారికేడ్లు ఏర్పాటు చేయించామని చెప్పారు. శనివారం వర్షం తగ్గడంతో కొంతమేర ఊరట లభించినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు, వరదల వల్ల నీటిని విడుదల చేస్తే ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసులను ఆదేశించారు. అంతకు ముందు ఆక్సాయిపల్లి వద్ద రోడ్డు నీట మునగడంతో ఏర్పడిన ఇబ్బందుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో మాధురి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో నరేశ్‌, అధికారులు తదితరులున్నారు.

కోటిలింగాలలో కలెక్టర్‌, ఎస్పీ పరిశీలన
వెల్గటూర్‌, జూలై 23: కోటిలింగాల వద్ద గోదావరి వరద పరిస్థితిని కలెక్టర్‌ గుగులోత్‌ రవి, ఎస్పీ సింధూశర్మ వేర్వేరుగా పరిశీలించారు. జగిత్యాల ఆర్డీవో మాధురితో కలిసి కలెక్టర్‌ పరిశీలించగా, ఎస్పీ సింధూ శర్మ ధర్మపురి సీఐ కోటేశ్వర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ, కోటిలింగాలకు గోదావరి స్నానాలకు వచ్చే భక్తులు గోదావరి నది లోపలి వరకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ తహసీల్దార్‌ రాజేందర్‌, ఎంపీడీవో సంజీవరావు, ఎస్‌ఐ శంకర్‌నాయక్‌, పోలీస్‌ సిబ్బంది పీ శ్రీను, అభిషేక్‌ తదితరులు ఉన్నారు.

ధర్మపురిలో ఎస్పీ
ధర్మపురి, జూలై 23: ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతిని ఎస్పీ సింధూశర్మ పరిశీలించారు. గోదావరి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ స్నానాలకు వచ్చే భక్తులను అప్రమత్తం చేయాలని చెప్పారు. ఎస్పీ వెంట ధర్మపురి సీఐ బిల్ల కోటేశ్వర్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana