బుధవారం 28 అక్టోబర్ 2020
Jagityal - Oct 02, 2020 , 02:29:12

వృద్ధులను భారంగా భావించొద్దు

వృద్ధులను భారంగా భావించొద్దు

జగిత్యాల/జగిత్యాల రూరల్‌ : వయో వృద్ధులను భారంగా కాకుండా సంస్కృతీసంప్రదాయాలకు వారధులుగా భావించాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. కొవిడ్‌-19 దృష్ట్యా గురువారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి వెబ్‌నార్‌ ద్వారా నిర్వహించిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ కార్యక్రమానికి మంత్రి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ‘ఎవాల్యూషన్‌ ఆఫ్‌ తెలంగాణ సీనియర్‌ సిటిజన్‌' మొబైల్‌ యాప్‌, ‘ఫర్‌ సీనియర్‌ సిటిజన్‌' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలవారీగా ఉన్న వయోవృద్ధుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి తదితర అంశా లు వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తారని తెలిపారు. మొబై ల్‌ యాప్‌ ద్వారా ఆశ్రమాలు, సంస్థల వివరాలు, వాటి నిర్వహణ, వాటిలో కల్పించే సౌకర్యాలు, చేయాల్సిన మార్పుల గురించి తెలియజేస్తారని వి వరించారు. రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సం క్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచి, విశిష్ట స్థానాల్లో ఉన్న ప్రముఖులందరూ 60 ఏళ్లు దాటిన వారేనన్నారు. జిల్లా కేంద్రంలో డేకేర్‌ సెంటర్‌ లేదా అన్ని సౌకర్యాలతో ఆశ్రమం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామ న్నా రు. జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చే యాలనే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉంద ని, ఎన్జీవో సంస్థ ముందుకు వస్తే ప్రభుత్వ ఆర్థిక స హాయం అందజేస్తామన్నారు. వృద్ధులకు ఆసరా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసరా పెన్షన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నా రు. తెలంగాణ దివ్యాంగులు, వయోవృద్ధుల సం క్షేమ శాఖ సంచాలకురాలు బీ శైలజ మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. వర్చువల్‌ కార్యక్రమం గ్లోబల్‌ కార్యక్రమంగా ప్రారంభించుకోవడం శుభసూచకమన్నా రు. ప్రభుత్వ ఆధీనంలో కరీంనగర్‌, రంగారెడ్డి జి ల్లాలో వృద్ధాశ్రమాలు నడుపుతున్నామని, కామారెడ్డి, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబా ద్‌, సంగారెడ్డిలో నిర్మాణాల కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి జిల్లాలో డేకేర్‌ సెంటర్లు, వృద్ధాశ్రమాలు, ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. దివ్యాంగుల, వయోవృద్ధుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ ఆలోచనల మేరకు మంత్రి ఈశ్వర్‌ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం గా అమలు చేస్తున్నారన్నారు. వెబ్‌నార్‌ ద్వారా  ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ వృద్ధులంటే ఎండిపోయి నేలరాలే వారు కాదని, మంచి ఫలాలని అభిప్రాయపడ్డారు. వృద్ధుల ప్రతిభ, అనుభవం సమాజానికి చాలా అవసరమని చెప్పారు. కార్యక్రమానికి ముందు సాయిరాం పాడిన పాట అందరిని అలరించింది. అనంతరం టీఆర్‌నగర్‌లో శ్రీ గాయత్రి విశ్వకర్మ వృద్ధాశ్రమంలో మంత్రి వృద్ధులకు పండ్లు పం పిణీ చేశారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని ఉద్ఘాటించారు. పెన్షన్‌ల కోసం ఏటా రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ వయోవృద్ధులు దైవ సమానులన్నారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ వృద్ధులపై ని ర్లక్ష్యం తగదని, వారిని ప్రేమ, ఆప్యాయతతో చూ డాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జగిత్యాల కలెక్టర్‌ గుగులోతు రవి, అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి, ఆర్డీవో మాధురి, జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్‌, కిన్నె వెల్ఫేర్‌ సొసైటీ వ్యవస్థాపకురాలు నాగచంద్రి కా దేవి, సీనియర్‌ సిటిజన్స్‌ సంఘం నాయకుడు డాక్టర్‌ జీ నాగేశ్వర్‌ రావు, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్‌ బీ సంతోష్‌కుమార్‌, లండన్‌ నుంచి డాక్టర్‌ సురేశ్‌ కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌ రెడ్డి, తహసీల్దార్‌ వెంకటేశ్‌, వృద్ధాశ్రమం నిర్వాహకులు టీవీ సూర్యం, ముమ్మాడి నాగభూషణం, రంగు రాజయ్య, బెజ్జంకి లక్ష్మణాచారి, కే సత్యనారాయణ, తొగిటి గంగాధర్‌, కేర్‌ టేకర్‌ కరుణ, నాయకులు పాల్గొన్నారు. 


logo