శనివారం 26 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 07, 2020 , 02:19:46

రైతుల సంఘటితానికే రైతు వేదికలు

రైతుల సంఘటితానికే రైతు వేదికలు

  • n ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ n చల్‌గల్‌లో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన
  • n పాల్గొన్న జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత

జగిత్యాల/జగిత్యాల రూరల్‌ : రైతులు సంఘటితంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల మండలంలోని చల్‌గల్‌ వ్యవసాయ క్లస్టర్‌ గ్రామంలో రూ.22 లక్షలతో రైతు వేదిక నిర్మాణానికి జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు పంటలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 12 రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామ ని, అధికారులు చొరవ తీసుకొని వీటిని త్వరగా పూర్తిచేయించాలని సూచించారు. జిల్లాలో వెయ్యి మందికి పైగా రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, ఆ కుటుంబాలకు రూ.5లక్షల రైతుబీమా అందించామని చెప్పారు. హరితహారం కా ర్యక్రమం చేపట్టి హరిత తెలంగాణగా మార్చే ది శగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, దీనికి ప్రజలందరూ సహకరించి మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. రైతు వేదికలతో రైతులంతా ఒక దగ్గ ర చేరి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మహిపాల్‌ రెడ్డి, సందీప్‌రావు, జిల్లా, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్లు బాల ముకుందం, నక్కల రవీందర్‌ రెడ్డి, సర్పంచ్‌ ఎల్లా గంగనర్సు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మోహన్‌ రెడ్డి, సర్పంచులు నారాయణ, గంగారాం, రత్నమాల శంకర్‌, ఏడీఏ సురేశ్‌, తహసీల్దార్‌ దిలీప్‌, ఏఈ ప్ర కాశ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo