Zelensky | ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Zelensky) తన కుటుంబ ఆదాయ వివరాలను వెల్లడించారు. గతేడాది అంటే 2024లో తాను తీసుకున్న వేతనం, తన కుటుంబ ఆస్తులు, ఆదాయం వంటి వివరాలను వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం.. అంతకుముందు ఏడాది (2023)తో పోలిస్తే అధ్యక్షుడి ఆదాయంలో పెరుగుదల కనిపించింది.
కాగా, ఉక్రెయిన్‌లో ప్రభుత్వాధికారులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించడం తప్పనిసరి. ప్రభుత్వ పెద్దలు గానీ, అధికారులు గానీ తమ ఆస్తుల వివరాలను ఏటా బహిరంగంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2024 సంవత్సరంలో తన ఆస్తుల వివరాలను అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. 2024లో తన కుటుంబ ఆదాయం 15,286,183 ఉక్రేనియన్ హ్రైవ్నియాలుగా ప్రకటించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 3.15 కోట్లు అన్న మాట. ఇందులో ప్రభుత్వ సేల్స్ బాండ్స్ నుంచి వచ్చిన ఆదాయం 8,585,532 (రూ.1.77 కోట్లు) హ్రైవ్నియాలుగా ఉంది. మిగిలిన మొత్తం అధ్యక్షుడి వేతనం, బ్యాంకు వడ్డీ, ప్రైవేటు రియల్ ఎస్టేట్ అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన చెల్లింపులుగా ‘ది కీవ్ ఇండిపెండెంట్’ తెలిపింది.
అంతకుముందు ఏడాది (2023) ఇదే సమయంలో తన కుటుంబ సభ్యుల ఆదాయం 316,700 డాలర్లుగా (రూ. 2.7 కోట్లు) జెలెన్స్కీ ప్రకటించారు. ఆ వివరాల ప్రకారం.. 2023తో పోలిస్తే గతేడాది అధ్యక్షుడి కుటుంబ ఆదాయంలో పెరుగుదల కనిపించింది. అయితే, ఈ పెరుగుదల అద్దెల ద్వారా వచ్చిందేనని కీవ్ పత్రిక తెలిపింది. అధ్యక్షుడి కుటుంబ ఆస్తులు, రియల్ ఎస్టేట్, వాహనాలలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది.
Also Read..
Tariffs | భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోంది.. ప్రతీకారానికి ఇదే సరైన సమయం : వైట్‌హౌస్
Myanmar Earthquake: మయన్మార్‌లో భూకంప విధ్వంసం.. ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో శాటిలైట్
Sunita Williams: హిమాలయాలు అద్భుతం: సునీతా విలియమ్స్