Ecuador | మరణించిందనుకొని ఓ వృద్ధురాలిని శవపేటిక(Coffin)లో శ్మశానవాటికకు తరలిస్తుండగా తట్టిన ఘటన ఇటీవల దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ (Ecuador) దేశంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. చనిపోయిందనుకున్న వృద్ధురాలు శవపేటికలోంచి బయటకు రావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బామ్మ బతికే ఉండటంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆ బామ్మ చివరికి ప్రాణాలు కోల్పోయింది.
ఈక్వెడార్‌లోని బాబహోయా నగరానికి చెందిన మోంటాయ (76) ( Montoya)
అనే వృద్ధురాలు ఇటీవల గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల (funeral) కోసం తీసుకెళ్లగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. మరణించిందనుకున్న ఆ వృద్ధురాలు ఒక్కసారిగా శవపేటికను తట్టింది. దీంతో ఆమె బతికే ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె తాజాగా ప్రాణాలు కోల్పోయింది. వైద్యం అందిస్తున్న సమయంలో స్ట్రోక్ రావడంతో ఆమె చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు.
Also Read..
Greece boat tragedy | గ్రీస్ పడవ ప్రమాదం.. 12 మంది మానవ అక్రమరవాణాదారుల అరెస్ట్
Tamil Nadu | రెండు బస్సులు ఢీ.. ఐదుగురు మృతి.. 80 మందికి గాయాలు
Adipurush | నేపాల్ లో ఆదిపురుష్ పై వివాదం.. భారత్ సినిమాలపై ఖాట్మాండ్లో నిషేధం