Adipurush | నేపాల్ లో ఆదిపురుష్ పై వివాదం.. భారత్ సినిమాలపై ఖాట్మాండ్లో నిషేధం
Adipurush | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ చిత్రంపై నేపాల్ (Nepal)లోనూ వివాదం తలెత్తింది. సీత.. నేపాల్ లో పుడితే, సినిమాలో మాత్రం భారత్ లో పుట్టినట్లు చూపించారంటూ అక్కడి అధికారులు మండిపడుతున్నారు. ‘ఆదిపురుష్’తో పాటు ఇండియన్ సినిమాలన్నింటినీ సోమవారం నుంచి ఖాట్మాండ్లో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
Adipurush | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిత్రంలో డైలాగ్స్తో పాటు ప్రజెంటేషన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రంపై నేపాల్ (Nepal)లోనూ వివాదం తలెత్తింది. సీత.. నేపాల్ లో పుడితే, సినిమాలో మాత్రం భారత్ లో పుట్టినట్లు చూపించారంటూ అక్కడి అధికారులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై నేపాల్ రాజధాని ఖాట్మాండ్ (Kathmandu) మేయర్ బలెన్ షా (Balendra Shah) స్పందించారు.
‘ఆదిపురుష్’తో పాటు ఇండియన్ సినిమాలన్నింటినీ సోమవారం నుంచి ఖాట్మాండ్లో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. సీత జన్మించిన ప్రాంతానికి సంబంధించిన అభ్యంతరకర సందేశాన్ని తొలగించాలని చిత్ర యూనిట్ ని మూడు రోజుల క్రితం కోరినట్లు తెలిపారు. సంబంధిత సన్నివేశాన్ని మార్చకపోతే కాఠ్ మాండూ మెట్రోపాలిటిన్ సిటీలో ఏ హిందీ చిత్రం ప్రదర్శితమయ్యే అవకాశం ఉండదని తెలిపారు. అయినప్పటికీ చిత్ర యూనిట్ అభ్యంతకరకర పదాలను ఇంకా తొలగించనందున జూన్ 19 (సోమవారం ) నుంచి ఖాట్మాండ్ మెట్రోపాలిటన్ పరిధిలోని థియేటర్లలో ‘ఆదిపురుష్’ సహా అన్ని హిందీ చిత్రాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ నిషేధం ఖాట్మాండ్ ప్రాంతానికే పరిమితమవుతుందని తెలిపారు.
మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించింది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు. ఓంరౌత్ దర్శకుడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read..
Hardeep Singh Nijja | కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది కాల్చివేత
Nepal Floods | నేపాల్ లో వరద బీభత్సం.. 5 మంది మృతి.. 28 మంది గల్లంతు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

