Bangkok | మయన్మార్ (Myanmar), థాయ్‌లాండ్ (Thailand) దేశాలను శుక్రవారం రెండు అత్యంత శక్తిమంతమైన భూకంపాలు (Earthquakes) కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, ప్రకంపనల సమయంలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు వీధుల్లోనే డెలివరీ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లో చోటు చేసుకుంది. భూ ప్రకంపన (Earthquake)ల నేపథ్యంలో బీఎన్‌హెచ్, కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ ఆస్పత్రుల్లోని రోగులను వైద్యులు దగ్గర్లోని పార్కుకి తరలించారు. రోగులకు అక్కడే వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఈక్రమంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆమెను స్ట్రెచర్‌పై ఉంచి పార్క్ వద్ద డెలివరీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Footage during the earthquake in #Bangkok a baby was born in the park 😭 Waht a story to tell ‘’ I was born during the earthquake ‘’ #แผ่นดินไหว #earthquake #myanmarearthquake #bangkokearthquake #ตึกถล่ม pic.twitter.com/7E0FdzfPEf
— Miia 🩵 (@i30199) March 28, 2025
1,000 దాటిన మరణాల సంఖ్య
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలను శక్తిమంతమైన భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. మయన్మార్‌లో నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.4 తీవ్రతతో భారీ భూకంపాలు సంభవించాయి. ఆ తర్వాత థాయ్‌లాండ్‌లో 7.3 తీవత్రతో భూమి కంపించింది. ఈ విపత్తులో రెండు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. రోడ్లు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌లు, ఇల్లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలకూలాయి.
ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల్లో మరణాల సంఖ్య వెయ్యి దాటింది. మయన్మార్‌లో కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ (Myanmar military) అధికారులు ఈ ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో, 2376 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. బ్యాంకాక్ (Bangkok)లో 10 మంది మరణించగా.. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. అయితే రెండు దేశాల్లో మరణాల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉన్నదని అమెరికా ఏజెన్సీ అంచనావేసింది.
Also Read..
Myanmar | మయన్మార్‌లో 1000 దాటిన మరణాల సంఖ్య.. 2 వేల మందికిపైగా గాయాలు
Myanmar | మయన్మార్‌కు ఆపన్నహస్తం.. 15 టన్నుల సహాయ సామగ్రిని పంపిన భారత్
Myanmar | మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.2 తీవ్రత