Myanmar | మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.2 తీవ్రత
వరుస భూకంపాలతో మయన్మార్ (Myanmar) వణికిపోతున్నది. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.8 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి కూడా మరోసారి భూమి కంపించింది.
నేపిడా: వరుస భూకంపాలతో మయన్మార్ (Myanmar) వణికిపోతున్నది. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.8 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి కూడా మరోసారి భూమి కంపించింది. రాత్రి 11.56 గంటలకు 4.2 తీవ్రతతో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) తెలిపింది.
Another earthquake with a magnitude of 4.2 on the Richter Scale hit Myanmar at 23.56 IST, March 28.
(Source – National Center for Seismology) pic.twitter.com/UQTHeBFQpy
— ANI (@ANI) March 28, 2025
మరోవైపు అఫ్ఘానిస్థాన్‌లో కూడా భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున 5.16 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించింది. భూమి అంతర్భాగంలో 180 కిలోమీటర్ల లోపల కదలకలు సంభవించాయని ఎన్సీఎస్ తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
EQ of M: 4.7, On: 29/03/2025 05:16:00 IST, Lat: 36.50 N, Long: 71.12 E, Depth: 180 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/F4P212Y0hC— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025
కాగా, మయన్మార్, దాని పొరుగున వున్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ భూకంపాలు వణికించాయి. రిక్టర్ స్కేల్‌పై 7.7, 6.8 తీవ్రతతో శుక్రవారం మధ్యాహ్నం రెండుసార్లు వెంటవెంటనే ప్రకంపనలు సంభవించాయి. ఈ ఘటనల్లో సుమారు 150 మంది మరణించగా, 730 మందికిపైగా గాయపడ్డారని మయన్మార్ అధికారిక మీడియా ఎంఆర్‌టీవీ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు. దీంతో మయన్మార్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సాగింగ్ నగర వాయువ్యంలో 16 కి.మీ దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. భూకంపం కారణంగా మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 పడకల దవాఖాన కుప్ప కూలిపోయింది. పేరు పెట్టని ఈ దవాఖానలో మృతుల సంఖ్య అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. అలాగే మండాలేలో భక్తులు ప్రార్థనల్లో ఉండగా ఒక మసీదు కూలింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. భూకంప ప్రకంపనలు పొరుగునే ఉన్న ఉత్తర థాయ్‌లాండ్‌కు కూడా వ్యాపించడంతో బ్యాంకాక్‌లోని కొన్ని మెట్రో, రైలు సర్వీసులను నిలిపివేశారు. థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రా బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంపం కారణంగా బ్యాంకాక్, ఇతర నగరాల్లోని భవనాలు వణికిన దృశ్యాలు భయోత్పాతం కలిగించాయి. చాలాచోట్ల ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీశారు. వందలాది మంది ఇంకా వీధుల్లోనే ఉండి, ఇళ్లలోకి వెళ్లడానికి భయపడుతున్నారు. బ్యాంకాక్‌లోని చుత్‌చాక్ పరిసరాలలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం నిలువునా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 78 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.ఎత్తయిన భవనాల నుంచి, చెరువుల నుంచి నీరు పొంగిపొర్లింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

