Myanmar | మయన్మార్లో 1000 దాటిన మరణాల సంఖ్య.. 2 వేల మందికిపైగా గాయాలు
Myanmar | మయన్మార్ (Myanmar), థాయ్లాండ్ (Thailand) దేశాల్లో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,000 దాటింది.
Myanmar | మయన్మార్ (Myanmar), థాయ్లాండ్ (Thailand) దేశాలను శుక్రవారం రెండు అత్యంత శక్తిమంతమైన భూకంపాలు (Earthquakes) కుదిపేసిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో మయన్మార్, థాయ్ దేశాలు వణికిపోయాయి. రోడ్లు, వంతెనలు, ఎయిర్పోర్ట్లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా మయన్మార్ ఈ విపత్తుకు తీవ్రంగా ప్రభావితమైంది. మృతుల సంఖ్య కూడా అక్కడ భారీగానే ఉంది. తాజా సమాచారం ప్రకారం రెండు దేశాల్లో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,000 దాటింది.
ప్రకృతి ప్రకోపానికి మయన్మార్లో కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ (Myanmar military) అధికారులు ఈ ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో, 2376 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. బ్యాంకాక్ (Bangkok)లో 10 మంది మరణించగా.. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. అయితే రెండు దేశాల్లో మరణాల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉన్నదని అమెరికా ఏజెన్సీ అంచనావేసింది.
Also Read..
Myanmar | మయన్మార్లో మరోసారి భూకంపం.. 4.2 తీవ్రత
Earthquake | మయన్మార్, బ్యాంకాక్లో భయానక భూకంపం.. 144 మంది దుర్మరణం
Myanmar | మయన్మార్లో 1,000 పడకల ఆసుపత్రి ధ్వంసం.. క్షతగాత్రులకు వీధుల్లోనే చికిత్స
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

