Screaming | అమెరికాకు చెందిన ఓ టిక్ టాకర్ పబ్లిక్ లో అరిచి (Screaming ) జైలుపాలైంది. స్నేహితుడితో కలిసి ట్రిప్ కోసం యూఏఈ (UAE) వెళ్లిన ఆమె అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ చేసి చిక్కుల్లో పడింది. వివరాల్లోకి వెళితే..
అమెరికా (America)కు చెందిన 29 ఏళ్ల టిక్ టాకర్ టియెర్రా యంగ్ అలెన్ (Tierra Young Allen) ఇటీవలే తన స్నేహితుడితో కలిసి దుబాయ్ (Dubai) పర్యటనకు వెళ్లింది. అక్కడ ఇద్దరూ ఓ కారు అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రయాణ సమయంలో వీరి కారు ప్రమాదానికి గురైంది. దీంతో వీరిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకుని అలెన్ స్నేహితుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే అద్దె కారు తీసుకున్నప్పుడు వీరు షోరూంలో తమ గుర్తింపు కార్డులను సమర్పించారు.
దుబాయ్ నుంచి అమెరికా తిరిగి వెళ్లే క్రమంలో అలెన్ తన గుర్తింపు కార్డులను తిరిగి తీసుకునేందుకు షోరూంకి వెళ్లింది. అయితే, షోరూం యజమాని కేసు తేలేంత వరకూ వాటిని ఇవ్వడం కుదరదని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన అలెన్.. షోరూం యజమానిపై నోరు పారేసుకుంది. గట్టిగట్టిగా అరుస్తూ అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Parliament Session | కుదిపేసిన మణిపూర్ అంశం.. ఉభయ సభలు రేపటికి వాయిదా
Netflix | ఇకపై భారత్ లోనూ పాస్వర్డ్ షేరింగ్ కుదరదు.. ప్రకటించిన నెట్ఫ్లిక్స్
Road Accident | యాక్సిడెంట్ జరిగిన చోట గుమిగూడిన జనంపైకి దూసుకెళ్లిన కారు.. 9 మంది మృతి