War : ఇజ్రాయెల్ దేశానికి హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాలస్తీనాలోని అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా గాజాలోని టెల్ అవీవ్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 29 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని పాలస్తీనా వైద్యాధికారులు వెల్లడించారు.
మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి. దాడులకు భయపడి ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న 29 మంది ఈ దాడులకు బలయ్యాయి. మరణించిన వారిలో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. కాగా గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడిచేసి 1200 మంది ప్రాణాలు తీసింది. మరో 251 మందిని బందీలను చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది.