మాస్కో: రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని నిలిపివేయాలని తన వాణిజ్య భాగస్వామి భారత్‌పై అమెరికా ఒత్తిడి చేయడంపట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది అమెరికాకే ఎదురుదెబ్బ తీస్తుందని ఆయన హెచ్చరించారు.
దక్షిణ రష్యాలోని సోచిలో నిర్వహించిన సదస్సులో పుతిన్ ప్రసంగిస్తూ రష్యా వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలు విధిస్తే అది ప్రపంచ ఇంధన ధరల పెంపునకు దారి తీయగలదని, చివరకు ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను కుంటుపరుస్తుందని పుతిన్ హెచ్చరించారు. డిసెంబర్ ప్రారంభంలో తాను తలపెట్టిన భారత్ సందర్శనపై పుతిన్ ఆసక్తిని వ్యక్తం చేశారు.