Vivek Ramaswamy | అమెరికా దేశాధ్యక్ష (US President Elections) ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో.. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మొదటి స్థానంలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉండగా.. రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారానికి కొందరు సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలు ( Silicon Valley tycoons) నిధుల సేకరణ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 29వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రామస్వామి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉన్న సోషల్ క్యాపిటల్ సంస్థ సీఈవో (CEO of Social Capital) చామాత్ పలిహపిటియా (Chamath Palihapitiya) నివాసంలో ఈ విందును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 10లక్షల డాలర్ల నిధులు సమీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిన్నర్ పార్టీకి హాజరయ్యే ( dinner invite) వారి వద్ద నుంచి ఒక్కొక్కరి నుంచి భారీగా వసూలు చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. డిన్నర్లో పాల్గొనాలనుకునేవారి వద్ద నుంచి 50 వేల డాలర్లు వసూలు చేయనున్నట్లు తెలిపింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.41లక్షలన్నమాట. ఈ డిన్నర్ ఇన్విటేషన్కు సంబంధించిన కరపత్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Vivek Ramaswamy
Also Read..
Justin Trudeau | భారత్-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. అమెరికా మొగ్గు ఎవరివైపంటే..?
Rat Bitese | 6 నెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి.. ఎముకలు బయటకు వచ్చేలా కొరికి తినేసిన వైనం