గురువారం 04 జూన్ 2020
International - Apr 15, 2020 , 12:35:04

జంతువుల నుంచి మ‌నుషుల్లోకి వైర‌స్ లు..వీడియో

జంతువుల నుంచి మ‌నుషుల్లోకి వైర‌స్ లు..వీడియో

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌న్నీ క‌రోనా దెబ్బ‌కు విల‌విల్లాడుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు దాదాపు చాలా వ‌ర‌కు దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అయితే వైర‌స్ వ్యాపించ‌డం మొద‌ల‌య్యాక ఆయా దేశాలు ఇదంతా చేస్తున్నాయి. వైర‌స్ లు రాకుండా ముందే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది. 

చాలా వ‌ర‌కు వైర‌స్ లు జంతువుల నుంచి మాన‌వ స‌మాజంలోకి ప్ర‌వేశించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటున్నారు ప‌లువురు నిపుణులు. క‌రోనా వైర‌స్ కూడా వీటికి అతీతం కాదట‌. ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ వన్య‌ప్రాణుల అక్ర‌మ‌ర‌వాణా, త‌ద్వారా ఏర్ప‌డే ప‌రిణామాల‌కు సంబంధించి ఓ వీడియోను అంద‌రితో షేర్ చేసుకున్నారు. 

ఈ భూమ్మీద అత్యంత ఎక్కువ‌గా ర‌వాణా చేయ‌బ‌డుతున్న క్షీర‌దం పాంగోలిన్‌. ఈ జంతువుల మాంసానికి చైనా, వియ‌త్నాంల‌లో డిమాండ్ ఎక్కువే. పాంగోలిన్ పొలుసుఉ వివిధ ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు వాడే మెడిసిన్ తయారీలో ఉప‌యోగిస్తార‌ట‌. అయితే దీని అధికారికంగా ఎలాంటి కొల‌మానం లేదు. గ‌తంలో వ‌చ్చిన సార్స్, ఎబోలా వంటి వైర‌స్ లు కూడా జంతువుల ద్వారా సంక్ర‌మించిన‌వే. 

సాధార‌ణంగా వ‌న్య‌ప్రాణులు ఎక్కువ రోగాలను తీసుకొస్తుంటాయి. అయితే ఇది అటవీ ప్రాంతంలో ఉన్నంత‌వ‌ర‌కు ఏం కాదు. కానీ ఒక్క‌సారి బ‌హిరంగ మార్కెట్‌లోకి రావ‌డం, మ‌రోవైపు మురికిగా ఉన్న బోన్ల ద్వారా వైర‌స్ లు సులభంగా మ‌నుషుల‌కు సోకే అవ‌కాశం ఉంటుంది. పాంగోలిన్ మాత్ర‌మే కాకుండా ఇత‌ర వన్య‌ప్రాణుల‌ను సంర‌క్షించి..భ‌విష్య‌త్తులో వైర‌స్ ల బారి నుండి ప్ర‌పంచాన్ని ర‌క్షించుందామ‌ని తెలిపే వీడియో బాగుంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo