Liverpool | ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ (Liverpool)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ విజయాన్ని ఆస్వాదిస్తున్న జనంపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా దాదాపు 50 మందికిపైగా గాయాలపాలయ్యారు.
ప్రీమియర్ లీగ్‌లో 20వ టైటిల్‌ను లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా లివర్‌పూల్‌లో ఆ జట్టు భారీగా సంబరాలు చేసుకుంది. అభిమానులకు అభివాదం చేస్తూ వీధుల్లో విక్టరీ పరేడ్ (Victory Parade) నిర్వహించింది. ఈ విజయోత్సవ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు తలివచ్చారు. దీంతో సిటీసెంటర్ మొత్తం కిక్కిరిపోయింది. ఆ సమయంలో జనసమూహంపైకి ఓ దుండగుడు కారుతో దూసుకొచ్చాడు. పలువురిని ఢీ కొట్టి ముందుకు వెళ్లాడు. ఈ ఘటనలో 50 మందికిపైగా ప్రజలు గాయాలపాలయ్యారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ ఘటనకు కారణమైన 53 ఏళ్ల తెల్లజాతి బ్రిటిష్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరోవైపు గాయపడిన వారిలో కనీసం 27 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఓ అధికారి తెలిపారు. స్వల్ప గాయాలతో ఉన్న మరో 20 మందికి సంఘటనాస్థలంలోనే చికిత్స అందించినట్లు చెప్పారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Ufffff 🤯
Un wn se volvió loco contra los aficionados del Liverpool en la Premier League pic.twitter.com/HpnGn8CtpY— koke_nortino (@antofaopina2022) May 27, 2025
Also Read..
Death Threat | 50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తా.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారునికి బెదింపు
Sandeep Reddy Vanga | అర్ధరాత్రి ఆ హీరోయిన్‌పై విరుచుకుపడ్డ సందీప్ రెడ్డి.. నీ నిజస్వరూపం ఇదేనా?