Shehbaz Sharif | భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రకటించారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ఇరాన్ (Iran) రాజధాని టెహ్రాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమేనని తెలిపారు.
కశ్మీర్, ఉగ్రవాదం, వాణిజ్యం, జల వివాదం సహా అన్ని సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమే అని తెలిపారు. ‘కశ్మీర్ సమస్య, ఉగ్రవాదం, జల వివాదం, వాణిజ్యం సహా అన్ని సమస్యలపై భారత్‌తో చర్చించేందుకు మేం రెడీ. ఆయా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మేము కోరుకుంటున్నాము’ అని అన్నారు. అదే సమయంలో భారత్ యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటే తామూ దీటుగానే స్పందిస్తామంటూ హెచ్చరించారు.
మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తమకు అప్పగిస్తేనే పాకిస్థాన్‌తో చర్చలు జరుపుతామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘భారత్-పాక్ మధ్య చర్చలంటూ జరిగితే.. అది ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే ఉంటుంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇరు దేశాల మధ్య జరిగే ఎలాంటి చర్చల్లోనైనా మూడోపక్షం ప్రమేయం ఉండదని కూడా భారత్ పేర్కొంది.
Also Read..
Friendship | పక్షుల్లోనూ దీర్ఘకాల మైత్రి.. మనుషుల్లానే పరస్పరం సహకరించుకుంటాయట!
Bacteria | గాలిని కాదు.. కరెంట్‌ను పీల్చే బ్యాక్టీరియా!
Drugs Smuggling | పిల్లి మెడకు కట్టి డ్రగ్స్‌ను స్మగ్లింగ్.. ఆ జైల్లో ఊహించని క్రైమ్ థిల్లర్!