Sandeep Reddy Vanga | అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత కూడా హిట్స్ తీసి టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరాడు. త్వరలో ఆయన స్పిరిట్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇందులో ప్రభాస్ కథానాయకుడిగా నటించనుండగా, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తుందని ఇటీవల అనౌన్స్ చేశాడు. అయితే ముందు దీపికా అంటూ వార్తలు రాగా, తర్వాత సందీప్ తన పేజ్ ద్వారా త్రిప్తిని కథానాయికగా అనౌన్స్ చేశాడు. అనేక కండిషన్లు పెట్టడం వల్లే ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశాడని వార్తలొచ్చాయి. అయితే ఇదే ఇష్యూ మీద బాలీవుడ్ మీడియాలో వరుసగా సందీప్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు రావడం మొదలు పెట్టాయి.
దీపిక తప్పుకోవడానికి సందీప్ రెడ్డినే ప్రధాన కారణం అంటూ వార్తలు వచ్చాయి. ఎక్కువగా ‘ఎ’ రేటెడ్ సీన్లు ఉండడం వల్ల దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందని, సందీప్ అన్ ప్రొఫెషనల్ అని ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో ఇదంతా పీఆర్ స్టంట్స్ అని గ్రహించిన సందీప్ రెడ్డి వంగా దీపికాకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. సోమవారం అర్ధరాత్రి వేళ ‘ఎక్స్’ వేదికగా దీపిక పేరు ఎత్తకుండానే ఆమె మీద పెద్ద బాంబులే వేశాడు. నేను ఒక కథని ఆర్టిస్ట్‌కి చెప్పానంటే అవతలి వ్యక్తిపై ఉన్న పూర్తి నమ్మకంతోనే చెబుతాను. కానీ ఆ కథను బయటపెట్టడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటి చెప్పారు. నా కథని బహిర్గతం చేయడమే కాకుండా ఒక యంగ్ యాక్టర్‌ని కూడా తక్కువ చేయడం మీ ఫెమినిజం?
ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వస్తుంది. ఫిల్మ్ మేకింగ్ నాకు అన్ని. అది వ్యక్తి అర్ధం చేసుకోదు. ఎప్పటికీ అర్ధం కూడా కాదు అంటూ సందీప్ అన్నారు. అలానే తన దైన స్టయిల్లో హిందీలో డైలాగ్‌ని పంచుకున్నారు. అంతేకాదు `డర్టీపీఆర్ గేమ్స్` అంటూ యాష్ ట్యాగ్‌ని కూడా మెన్షన్ చేశారు. మొత్తం కథను బయటపెట్టేసినా తనకు పోయేదేమీ లేదని అన్నాడు సందీప్.. దీంతో ఇదంతా దీపికను ఉద్దేశించి చేసినట్టుగా అర్ధమైంది. ట్వీటే అని అందరికీ అర్థమైపోవడంతో ఆమె మీద, బాలీవుడ్ పీఆర్ మాఫియా మీదా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక సందీప్ సినిమాకి హ్యాండ్ ఇచ్చిన దీపికా.. అల్లుఅర్జున్- అట్లీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.