వాషింగ్టన్: ఒక వాహనం జనంపైకి దూసుకెళ్లింది. (Vehicle rams into crowd) ఈ సంఘటనలో 28 మందికిపైగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం తూర్పు హాలీవుడ్ ప్రాంతంలోని నైట్‌క్లబ్ బయట పెద్ద సంఖ్యలో ఉన్న జనంపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సంఘటనలో సుమారు 28 మందికిపైగా గాయపడినట్లు లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం అధికారి తెలిపారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పారు. సుమారు పది మంది తీవ్రంగా, మరో 15 మంది స్వల్పంగా గాయపడినట్లు వెల్లడించారు.
మరోవైపు జనంపైకి దూసుకెళ్లే ముందు వాహనం డ్రైవర్ స్పృహ కోల్పోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే డ్రైవర్ గురించి, సంఘటనకు దారి తీసిన కారణాల గురించి వెల్లడించలేదు. కాగా, ఈ సంఘటనతో అక్కడున్న వారు భయాందోళన చెందారు.
Also Read:
Cop’s Son Car Race | పోలీస్ కొడుకు కారు రేస్.. నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి
Watch: వర్షం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?