Donald Trump : ఇరాన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ వైఖరి వల్లే చర్చలు విఫలమయ్యాయన్నారు. ఇరాన్ నుంచి ఎవరైనా అమెరికాపై దాడి చేస్తే వారిని నరకానికి పంపించడం ఖాయమని హెచ్చరించారు.
‘‘హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని యూఎస్ నేవీని ఆదేశించా. ఈ మార్గంలో వెళ్లే నౌకల్ని అడ్డుకుంటాం. ఈ జలసంధి నుంచి వెళ్లే, వచ్చే నౌకల్ని యూఎస్ నేవీ అడ్డుకుంటుంది. ఇరాన్ అన్ని షరతులకు అంగీకరించింది. ఒక్క అణు ఒప్పందం అంశంలో మాత్రమే అంగీకరించడం లేదు. అణు కార్యక్రమాల్ని ఆపేసేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు. ప్రమాదకరమైన దేశం వద్ద అణ్వాయుధం ఉండటానికి వీల్లేదు. ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించలేదు. సరైన సమయంలో ఇరాన్‌ను అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతర్జాతీయ చట్టాలను ఇరాన్ ఉల్లంఘిస్తోంది. హార్ముజ్ జలసంధిని తెరుస్తామని హామీ ఇచ్చిన ఇరాన్ మాట తప్పింది. సీ మైన్స్ పేరిట ప్రపంచాన్ని ఇరాన్ బెదిరిస్తోంది. సీ మైన్స్‌ను తొలగించే పనిలో ఉన్నాం. ఇరాన్‌కు టోల్ చెల్లించే నౌకల్ని కూడా అడ్డుకుంటాం. ఇరాన్ చర్యల వల్ల అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలపై లేదా సైనిక నౌకలపై ఎవరైనా దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తాం. హార్ముజ్‌ను దిగ్భంధించే అంశంలో ఇతర దేశాలు కూడా చేరబోతున్నాయి’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
పాక్‌లో ఇరాన్-అమెరికా మధ్య 20 గంటలపాటు చర్చలు జరిగాయి. ట్రంప్ ఆదేశించినట్లు హార్ముజ్ జలసంధిని అమెరికా నౌకలు దిగ్బంధిస్తే ప్రపంచానికి పెను సవాళ్లు ఎదురవ్వడం ఖాయం. ఇప్పటికే నౌకల రవాణా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రపంచ దేశాలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి.