సీజ్‌ఫైర్‌ను పొడిగించం!.. ఒప్పందానికి రాకపోతే బాంబుల మోతే.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసే బుధవారంలోగా ఇరాన్ తమతో ఒక ఒప్పందానికి రాకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు.
- రెండో విడత చర్చలపై సందిగ్ధత
- బెదిరింపుల మధ్య చర్చలకు అంగీకరించం: ఇరాన్
- నేటితో ముగియనున్న గడువు
వాషింగ్టన్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసే బుధవారంలోగా ఇరాన్ తమతో ఒక ఒప్పందానికి రాకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. అయితే పాక్‌లోని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత నెలకొన్నది.
తమ ప్రతిపాదనలపై ఇరాన్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన ఇస్లామాబాద్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు సమాచారం. శాంతి చర్చలకు అమెరికా బృందానికి వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికాతో రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ దేశ అధికారిక సమ్మతి కోసం తాము ఇంకా వేచి చూస్తున్నామని పాకిస్థాన్ మంత్రి అత్తవుల్లా తరార్ మంగళవారం ప్రకటించారు.
సీజ్ ఫైర్‌ను పొడిగించం
ఇరాన్‌తో సీజ్‌ఫైర్‌ను పొడిగించనని ట్రంప్ స్పష్టం చేశారు ‘వారు కనుక శాంతి ఒప్పందం చేసుకుంటే తమను తాము బలమైన దేశంగా, అద్భుతమైన దేశంగా మరోసారి తీర్చిదిద్దుకోగలుగుతారు. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్‌తో అమెరికా ఒక గొప్ప ఒప్పందానికి వస్తుంది. వారికి ఇంకో అవకాశం లేదని నేను భావిస్తున్నానని’ ట్రంప్ తెలిపారు. రెండో విడత చర్చల నుంచి ఏం ఫలితాలు ఆశిస్తున్నారన్న మీడియా ప్రశ్నకు ‘మేం వారి నాయకులను తొలగించాం.
ఇది ఒక విధంగా పరిస్థితులను క్లిష్టతరం చేస్తున్నది. అయినా ఈ నాయకులు హేతుబద్ధంగా ఉన్నారు. మీరు దానిని ఏమని పిలిచినా అది పాలన మార్పే. నేను చేస్తానని చెప్పని పని ఇది. కానీ నేను దానిని పరోక్షంగా చేసి చూపించాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. తమపై బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో వారితో చర్చలకు అంగీకరించబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘాలిబాఫ్ స్పష్టం చేశారు.
ఇరాన్ నౌకలో చైనా నుంచి క్షిపణి రసాయనాలు
అమెరికా సీజ్ చేసిన ఇరాన్‌కు చెందిన తౌస్కా అనే వాణిజ్య నౌకకు సంబంధించి ఐరాసలోని యూఎస్ మాజీ రాయబారి, రిపబ్లికన్ నేత నిక్కీ హేలి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నౌకలో క్షిపణి తయారీలో ఉపయోగించే రసాయనాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Donald Trump
- iran
- Islamabad
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

