US president : భారత్‌పై మరిన్ని సుంకాలు వేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గత వారం ప్రకటించిన 25 శాతం సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని మున్ముందు వాటిని ఇంకా పెంచబోతున్నామని బెదిరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ మార్కెట్లో భారీ లాభాలకు అమ్ముకుంటున్న భారత్‌పై గణనీయ స్థాయిలో సుంకాలు పెంచబోతున్నామని సోషల్‌మీడియా ద్వారా ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు.
రష్యాతో యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్ పట్టించుకోవడం లేదని, అందుకే ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతామని ట్రంప్ వెల్లడించారు. ఇదిలావుంటే వలస వ్యవహారాల్లోనూ అమెరికాను భారత్ మోసం చేస్తోందనీ వైట్ హౌస్ ఉన్నతాధికారి స్టీఫెన్ మిల్లర్ విమర్శించారు. దీనివల్ల తమ దేశ కార్మికులకు ఎంతో నష్టం జరుగుతోందని చెప్పారు.