Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పశ్చిమాసియా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా ఇవాళ సౌదీ అరేబియా (Saudi Arabia)కు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో రియాద్ (Riyadh) చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman) ఘనంగా స్వాగతం పలికారు. ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం సౌదీ గగనతలంలోకి చేరుకోగానే.. రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్ (Royal Saudi Air Force)కు చెందిన ఎఫ్-15 విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి.
Saudi F-15’s providing honorary escort for Air Force One! 🇺🇸🇸🇦 pic.twitter.com/c0EURfBRNt
— Margo Martin (@MargoMartin47) May 13, 2025
అధ్యక్షుడు ట్రంప్ నాలుగు రోజుల పాటు పశ్చిమాసియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సౌదీ, యూఏఈ, ఖతార్‌ను సందర్శించనున్నారు. మరోవైపు ట్రంప్ కోసం సౌదీ ప్రభుత్వం ఇవాళ ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు పలు కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. అమెజాన్, ఉబర్, గూగుల్, బోయింగ్, ఎన్విడియా, ఓపెన్ ఏఐ సీఈవోలతోపాటు టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కూడా హాజరుకానున్నారు. ఇక ట్రంప్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్, ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ కూడా పశ్చిమాసియా పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు.
Also Read..
Donald Trump | ఫ్రీగా ఇస్తానంటే తీసుకోకపోవడం మూర్ఖత్వం : డొనాల్డ్ ట్రంప్
India tariffs | అమెరికా వస్తువులపై భారత్ ప్రతీకార సుంకాలు..!
Operation Sindoor | భారత్ దాడిలో 11 మంది సైనికులు చనిపోయారు : పాకిస్థాన్