Donald Trump | ఫ్రీగా ఇస్తానంటే తీసుకోకపోవడం మూర్ఖత్వం : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానాన్ని ఉచితంగా ఇస్తానంటే వద్దని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు. ఖతార్ పాలకులు డొనాల్డ్ ట్రంప్‌కు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించారు.
Donald Trump : కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానాన్ని ఉచితంగా ఇస్తానంటే వద్దని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు. ఖతార్ పాలకులు డొనాల్డ్ ట్రంప్‌కు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించారు. ఆ బహుమతిని స్వీకరించేందుకు ట్రంప్ తన సమ్మతి తెలిపారు. దీనిపై ప్రతిపక్ష డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారు. జాతీయ భద్రతకు ప్రమాదకరం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విమనాన్ని గిఫ్ట్ అందుకోనుండటంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి బహుమతిని వద్దని చెప్పడం ముర్ఖత్వమే అవుతుందన్నారు. సోమవారం వైట్‌హౌస్ వద్ద గిఫ్టుకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలు ఇచ్చారు. ఖరీదైన విమానాన్ని గిఫ్టుగా అందుకోవడం అనేది గొప్ప విషయంగా అభివర్ణించారు. ‘వారు ఫ్రీగా జెట్ విమానం ఇస్తుంటే లేదు లేదు. నాకు ఫ్రీగా వద్దు. మీకు 1 బిలియన్ డాలర్లు లేదా 400 మిలియన్ డాలర్లు ఖరీదు కట్టిస్తా అని చెప్పాలా..? అని ప్రశ్నించారు.
ఈ ఖరీదైన గిఫ్ట్ ద్వారా ఖతార్ రాయల్ ఫ్యామిలీ ఏమైనా లబ్ధి పొందనుందా..? భద్రతాపరమైన సమస్యలు తలెత్తవా..? అనే ప్రశ్నలకు ట్రంప్ అలాంటివేం జరగవని జవాబిచ్చారు. తాను ఇలాంటి ఆఫర్‌ను ఎప్పటికీ తిరస్కరించనని, ఉచితంగా ఖరీదైన విమానాన్ని ఇస్తున్నప్పుడు వద్దనడానికి తానేమైనా తెలివితక్కువ వాడినా..?’ అని ప్రశ్నించారు. ‘అధ్యక్ష కాలం ముగిసిన తర్వాత ఈ విమానాన్ని వ్యక్తిగతంగా వాడుకుంటారా..?’ అన్న ఒక విలేకరి ప్రశ్నతో ట్రంప్ ఆగ్రహించారు. విమానాన్ని అధ్యక్ష లైబ్రరీకి ప్రదర్శన కోసం విరాళంగా ఇస్తానని చెప్పారు.
కాగా డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో మధ్యప్రాచ్యంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఖతార్ పాలక కుటుంబం విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా ప్రకటించింది. ఆ బహుమతిని స్వీకరించేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. అధికారులు ఆ విమానానికి అధ్యక్ష విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’కు తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. ట్రంప్ పదవీ విరమణ చేసేవరకు ఆ విమానాన్ని ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ కు కొత్త వెర్షన్‌గా వాడుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు.
అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఈ ఖరీదైన బహుమతిని స్వీకరించడంతోపాటు దాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్‌గా వినియోగించాలనుకోవడం జాతీయ భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని పలువురు డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

