రియాద్: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ దాడిలో 300 మిలియన్ డాలర్ల విలువైన కీలక ఈ-3 సెంటిన్రీ విమానం ధ్వంసమైంది. (US loses AWACS aircraft) దీంతో అమెరికా మరో భారీ నష్టాన్ని చవిచూసింది. మార్చి 27న సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. అమెరికాకు చెందిన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానంగా పిలిచే ఈ-3 సెంటిన్రీ ధ్వంసమైంది. సుమారు 300 మిలియన్ డాలర్ల విలువైన ఈ యుద్ధ విమానం పూర్తిగా నాశనమైంది. ఇరాన్ క్షిపణి దాడిలో సుమారు పది మంది అమెరికా సైనికులు గాయపడినట్లు సమాచారం.
కాగా, సౌదీ ఎయిర్ బేస్‌లో ధ్వంసమైన ఈ-3 సెంటిన్రీ విమానం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ యుద్ధ విమానాన్ని కోల్పోవడం గురించి అమెరికా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ-3 సెంటిన్రీ అనేది బోయింగ్ అభివృద్ధి చేసిన అమెరికన్ వైమానిక ముందస్తు హెచ్చరిక, నియంత్రణ విమానం. ఈ-3 సెంటిన్రీ విమానాలను సాధారణంగా ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (AWACS) అని కూడా పిలుస్తారు.

Us Loses Key E 3 Sentry
మరోవైపు ఈ విమానం పై భాగంలో తిరిగే రాడార్ డిస్క్ ఉంటుంది. శత్రువు ముప్పును గుర్తించేందుకు, ఇతర యుద్ధ విమానాలకు మార్గనిర్దేశం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ విమానం యుద్ధ సమయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సరిహద్దులకు చాలా దూరంలో ఉన్న వైమానిక శత్రు బలగాలను గుర్తిస్తుంది. వాటి ఉనికిని పసిగడుతుంది. దీంతో ఫైటర్, ఇంటర్‌సెప్టర్ యుద్ధ విమానాలను శత్రు లక్ష్యాల వైపు మళ్లించేందుకు సహకరిస్తుంది.
Also Read:
US Troops | అమెరికా దళాలు పర్షియన్ గల్ఫ్ షార్క్‌లకు ఆహారంగా మారుతారు.. ఇరాన్ హెచ్చరిక
Iran | స్కూల్‌పై దాడికి ఆదేశించిన అమెరికన్ అధికారుల వివరాలు వెల్లడించిన ఇరాన్
LPG Tankers | గల్ఫ్ నుంచి భారత తీరంవైపు రెండు ఎల్పీజీ నౌకలు