US issues advisory | భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఒకరిపై ఒకరు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ఈ మేరకు పాక్‌లోని తమ పౌరులు, దౌత్యవేత్తలను అప్రమత్తం (US issues advisory) చేసింది. వెంటనే లాహోర్ (Lahore)ను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు లాహోర్‌లోని యూఎస్ ఎంబసీ సూచనలు జారీ చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం రాత్రి ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిన భారత సైన్యం.. తాజాగా పాక్‌లోని కీలక నగరాలపై దాడి చేస్తోంది. లాహోర్, సియాల్కోట్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి వంటి ప్రధాన నగరాలపై డ్రోన్లతో విరుచుకుపతోంది. భారత్ దాడుల్లో పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకూ రూ.1600 కోట్ల విలువైన ఆస్తులను భారత్ ధ్వంసం చేసినట్లు సమాచారం.
Also Read..
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌తో నేలమట్టమైన ఉగ్రస్థావరాలు.. ఉపగ్రహ చిత్రాలు
India-Pak | పాక్‌కు గట్టి షాక్.. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసిన భారత్