Illegal Immigrants | అక్రమ వలసదారులపై ఉక్కుపాదం.. ట్రంప్ ఆదేశాలతో 500 మందికిపైగా అరెస్ట్
Illegal Immigrants | అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై (Illegal Immigrants) ఉక్కుపాదం మోపుతున్నారు.
Illegal Immigrants | అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై (Illegal Immigrants) ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అక్రమ వలసదారులను అరెస్ట్ చేయిస్తున్నారు. తాజాగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడిన సుమారు 500 మందికిపైగా వలసదారులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వందలమందిని దేశం నుంచి పంపించేశారు (Deports Hundreds).
వలసదారుల అరెస్ట్‌పై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో అధికారులు ఇప్పటి వరకూ 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్టైన వారంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిన నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని తెలిపారు. అంతేకాకుండా సైనిక విమానాల్ని ఉపయోగించి వందలాదిమందిని బహిష్కరించినట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధ్యక్షుడు ట్రంప్ నెరవేరుస్తున్నట్లు కరోలిన్ వివరించారు.
కాగా, అక్రమ వలసలదారుల బహిష్కరణకు సంబంధించి తీసుకొచ్చిన కీలక బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బిల్లు ఇదే అని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.
దేశంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని, వేల వేల సంఖ్యలో హంతకులు కూడా ఉన్నారని, వారందర్నీ అణిచివేయనున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రస్తుతం 11 వేల మంది హంతకులు జీవిస్తున్నట్లు చెప్పారు. దాంట్లో 48 శాతం మంది.. ఒకరి కన్నా ఎక్కువ మందిని హతమార్చినట్లు ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో జైళ్లలో ఉన్న వారు అమెరికాకు వచ్చేస్తున్నట్లు తెలిపారు. వెనిజులాలో క్రైం రేటు 78 శాతం తగ్గినట్లు ట్రంప్ చెప్పారు. విదేశాల్లోని వీధి గ్యాంగ్‌లు ఇప్పుడు అమెరికాకు వచ్చేశాయని, ఆ ముఠాల ఆగడాలను కొలరాడో, లాస్ ఏంజిల్స్‌లో చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
పీవ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. అమెరికాలో 40 లక్షల మంది మెక్సికన్లు అక్రమంగా జీవిస్తున్నారు. 2022లో సరిహద్దు ద్వారా సుమారు లక్షన్నర మంది మెక్సికన్లు అమెరికాలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అమెరికాకు వలస వెళ్తున్న వారిలో భారత్, చైనా, వెనిజులా, క్యూబా, బ్రేజిల్, కెనడా దేశస్థులు ఉన్నారు.
Also Read..
“Donald Trump | ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపుకు ట్రంప్ ఫార్ములా ఇదీ”
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

