Donald Trump | ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపుకు ట్రంప్ ఫార్ములా ఇదీ
Donald Trump | సౌదీ అరేబియా, ఒపెక్ దేశాలు ముడి చమురు ధరలు తగ్గిస్తే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
Donald Trump | ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఫార్ములా కనిపెట్టారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ గురువారం దావోస్లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సౌదీ అరేబియా, ఒపెక్ దేశాలను ముడి చమురు ధరలు తగ్గించాలని కోరారు. అలా క్రూడాయిల్ ధరలు తగ్గిస్తే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగిపోతుందన్నారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు దావోస్లో డబ్ల్యూఈఎఫ్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
రెండోసారి అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టడంతో అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యావత్ ప్రపంచ దేశాలకు శ్రేయస్సుతోపాటు శాంతి చేకూరుతుందని చెప్పారు. తమ దేశం మరింత సంపన్నం, శక్తిమంతం అవుతుందన్నారు. అసాధారణ రీతిలో విపత్తులకు పరిష్కారం కనుగొంటామని తెలిపారు. ప్రపంచంలోనే అమెరికాకు అత్యధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని, వాటిని తాము వాడేస్తామని వెల్లడించారు. పాత కాలం నాటి పది చట్టాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చానని, దేశ ప్రజలకు చేయూతనిచ్చేందుకు పన్నుల్లో కోత విధిస్తానని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

