పాక్ దుస్తుల దౌత్యం!.. ఇరాన్‌తో యూనిఫాం, అమెరికాతో సూటు మునీర్ భిన్న ఆహార్యం
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ చర్చలకు ముందు ఇస్లామాబాద్‌లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలకు ఆహ్వానం పలికిన సందర్భంగా పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ తన వస్త్రధారణలో మార్పుతో అందరి దృష్టిని ఆకర్షించారు.
న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ చర్చలకు ముందు ఇస్లామాబాద్‌లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలకు ఆహ్వానం పలికిన సందర్భంగా పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ తన వస్త్రధారణలో మార్పుతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర ఘాలీబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందానికి శుక్రవారం స్వాగతం పలికినపుడు మునీర్ తన సైనిక దుస్తుల్లో కనిపించారు.
అయితే కొన్ని గంటల తర్వాత శనివారం నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు స్వాగతం పలికినపుడు ఆయన నల్ల సూట్లో కనిపించారు. దుస్తుల్లో మార్పు సూక్ష్మమైన దౌత్య సందేశాన్ని ప్రతిబింబిస్తుంది.
విదేశీ నాయకులను కలిసేటప్పుడు ఒక సైనికాధికారి ఎల్లప్పుడూ యూనిఫాంలో ఉండాలి. తాను అమెరికన్లతో దౌత్యవేత్తగా, ఇరాన్‌తో సైనికుడిగా ఉన్నానని చూపించుకోవడమే అసిమ్ మునీర్ లక్ష్యం. ఆయన ఇస్తున్న సందేశం అదే. అయితే ఇది ఒక సీనియర్ ఆర్మీ జనరల్ ప్రవర్తనకు తగనిది అని రిటైర్డ్ మేజర్ జనరల్ సంజయ్ మేస్టన్ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Asim Munir
- iran
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

