US air travel meltdown | అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. షట్డౌన్ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజరు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్పై ఒత్తిడి తగ్గించడానికే ప్రభుత్వం విమాన సేవల్లో కోత విధించింది.
ప్రభుత్వ నిర్ణయంతో వరుసగా మూడో రోజూ అమెరికా వ్యాప్తంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 2,700కిపైగా విమానాలు రద్దైనట్లు స్థానిక మీడియా తెలిపింది. 10,000కుపైగా విమానాలు ఆలస్యమైనట్లు పేర్కొంది. దీంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని ముఖ్యమైన నగరాలైన అట్లాంటా, చికాగో, షార్లెట్, నెవార్క్ ఎయిర్పోర్ట్స్లో ఈ సమస్య తలెత్తింది. విమానాలు రద్దు, ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also Read..
US Shutdown | ముగింపు దిశగా అమెరికా షట్డౌన్.. సెనేట్లో కీలక బిల్లుకు ఆమోదం
Australia | 16 ఏండ్లలోపు వారికి సోషల్మీడియా నిషేధం.. ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని
Super Typhoo | ఫిలిప్పీన్స్లో సూపర్ టైఫూన్ ఫుంగ్-వాంగ్ విధ్వంసం