Australia | ఆస్ట్రేలియా (Australia) ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese) కీలక ప్రకటన చేశారు. దేశంలో 16 ఏండ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల (Social Media Ban) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ సేఫ్టీ ఎమెడ్మెంట్ బిల్-2024 ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి అమల్లోకి రానుంది. ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, రెడిట్, యూట్యూబ్ తదితర మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుంది.
We’re banning social media for under-16s to keep them safe online. pic.twitter.com/wUjYZpjzzG
— Anthony Albanese (@AlboMP) November 10, 2025
సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ (ban social media for children) ఆస్ట్రేలియా ప్రభుత్వం గతేడాది కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ (Australian House of Representatives) ఆమోద ముద్ర వేసింది. ప్రతినిధుల సభలో 102 ఓట్ల బలంతో బిల్లుకు ఆమోదం లభించింది. సెనెట్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 34, వ్యతిరేకంగా 19 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ప్రకారం.. 16 ఏండ్ల లోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.273 కోట్లకు పైమాటే. బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది.
Also Read..
Super Typhoo | ఫిలిప్పీన్స్‌లో సూపర్ టైఫూన్ ఫుంగ్-వాంగ్ విధ్వంసం
Dementia | చిత్త వైకల్యానికి మ్యూజిక్‌తో చెక్!
Greener | తక్కువ పచ్చదనంతోనే మంచి మూడ్.. ఇంట్లో ఎక్కువ మొక్కలుంటే ఒత్తిడి