న్యూఢిల్లీ: రోజూ మంచి సంగీతం వినడం ద్వారా వృద్ధాప్యంలో చిత్త వైకల్యం(డిమెన్షియా) వచ్చే ప్రమాదం 40 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ‘వృద్ధుల్లో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సంగీత కార్యకలాపాలు మంచి వ్యూహం కావచ్చు’ అని ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొన్నది.
70 ఏండ్లు పైబడిన 10,893 మంది వృద్ధుల డాటాను పరిశోధకులు విశ్లేషించగా, ఇందులో రోజూ సంగీతం వినటం, సంగీత వాద్యాన్ని వాయించడం చేసిన 40 శాతం మందిలో చిత్త వైకల్యం ముప్పు పెద్దగా కనపడలేదు.