Super Typhoo | కల్మెగి తుపాన్ సృష్టించిన విద్వంసం నుంచి కోలుకోకముందే ద్వీప దేశం ఫిలిప్పీన్స్ (Philippines)ను మరో తుపాను అతలాకుతలం చేస్తోంది. ‘ఫుంగ్-వాంగ్’ (Typhoon Fung wong) అనే సూపర్ టైఫూన్ (Super Typhoon) దేశంపై విరుచుకుపడింది. ఈ ఏడాది దేశంలో సంభవించిన అత్యంత శక్తిమంతమైన తుపాన్లలో ఒకటైన ఫుంగ్-వాంగ్ ఆదివారం తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ తుపాను ధాటికి ఇప్పటి వరకూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒక మిలియన్ మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
కాగా, ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ కల్మెగి (Typhoon Kalmaegi) పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తీవ్ర స్థాయిలో వరదలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కల్మెగి ధాటికి దేశం మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. దాదాపు 220 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది మిస్సయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం తుపాను కారణంగా సుమారు 20 లక్షల మంది ప్రభావితమయ్యారు. 5.6 లక్షల మంది గ్రామస్థులు నిరాశ్రయులయ్యారు.
Also Read..
Dementia | చిత్త వైకల్యానికి మ్యూజిక్‌తో చెక్!
Greener | తక్కువ పచ్చదనంతోనే మంచి మూడ్.. ఇంట్లో ఎక్కువ మొక్కలుంటే ఒత్తిడి
మందకొడిగా విస్తరిస్తున్న విశ్వం.. వేగాన్ని డార్క్ ఎనర్జీ లాగుతోందా?