కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై గురువారం రష్యా వైమానిక దాడులు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణ భయంతో అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో దాచుకుంటున్నారు. కుటుంబాలతో కలిసి అండర్‌గ్రౌండ్ స్టేషన్లలో షెల్టర్ తీసుకుంటున్న ఫోటోలు రిలీజ్ అయ్యాయి. పిల్లలు, వృద్ధులతో కలిసి బిక్కుబిక్కుమంటూ టన్నెల్స్‌లో తలదాచుకుంటున్నారు. కీవ్‌తో పాటు ఖార్కీవ్ నగరాల్లో ఉన్న మెట్రో స్టేషన్లలో ఈ సీన్లు కనిపించాయి. వెచ్చని దుస్తులు, బ్లాంకెట్లు కప్పుకుని వందల సంఖ్యలో జనం అండర్ గ్రౌండ్ స్టేషన్లకు చేరారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కర్ఫ్యూ విధించారు. అయితే రష్యా వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు.. మెట్రో స్టేషన్లను బాంబు షెల్టర్లుగా వాడుతున్నారు. ఇప్పటివకే వేలాది మంది ప్రాణ రక్షణ కోసం సమీప దేశాలకు వలస వెళ్లారు. లక్ష మందికిపైగా దేశం దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. యుద్ధ శరణార్థులను స్వాగతించేందుకు సరిహద్దు దేశమైన పోలాండ్‌లో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.