ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తమకు భారత్ అందించిన సహకారానికి ఉక్రెయిన్ ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్లో అత్యంత తక్కువ వయసున్న ఎంపీ స్వియాటోస్లావ్ యురాష్ మాట్లాడుతూ.. ఈ శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయించే దేశాల్లో భారత్ ఒకటని కొనియాడారు.
‘‘రష్యాతో యుద్ధం విషయానికొస్తే.. మా అధ్యక్షుడితో భారత ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించినందుకు ధన్యవాదాలు. ఇక్కడ భారత్ తీసుకున్న మానవీయ చర్యలకు రుణపడి ఉంటాం’’ అని చెప్పారు. ఇక రష్యాతో సంబంధాల విషయంలో భారత్ ఆలోచించుకోవాలని సూచించారు. రష్యా-భారత్ మధ్య మిలటరీ, వ్యూహాత్మక స్నేహబంధాలు ఉన్నాయని చెప్పిన యురాష్.. ఈ విషయంలో భారత్ మరొకసారి ఆలోచించుకోవాలని సూచించారు.
గడిచిన 20 ఏళ్లలో పుతిన్ హయాంలో రష్యా చేసిన దారుణాలను గుర్తించాలని, ఈ విషయాల్లో రష్యాను భారత్ శిక్షించాలని కోరారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తటస్థ వైఖరి వ్యవహరించిన భారత్.. యూఎన్లో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయలేదన్న సంగతి తెలిసిందే. అలాగే ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్యలపై యూఎన్ మానవహక్కుల సంఘం ఒక స్వతంత్ర కమిటీని నియమించాలని ప్రతిపాదించింది. దీనిలో కూడా భారత్ ఓటు వేయలేదు.
India is one of those countries which will decide fate of this century. As far as Indian position on Russian relationship is concerned, thankful for the call PM Modi made to our President.We're thankful for humanitarian steps India has been making: Sviatoslav Yurash, Ukrainian MP pic.twitter.com/kRFDJ5Y6cZ
— ANI (@ANI) March 9, 2022