బుధవారం 05 ఆగస్టు 2020
International - Jul 11, 2020 , 08:22:20

అమెరికాలో కరోనా విజృంభన.. ఒకేరోజు 68 వేల కేసులు

అమెరికాలో కరోనా విజృంభన.. ఒకేరోజు 68 వేల కేసులు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కరోనాకు ప్రధాన కేంద్రంగా మారిన అమెరికాలో గత మూడు రోజులుగా 65 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నిన్న ఒకేరోజు దేశవ్యాప్తంగా 68 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 32,91,786 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,36,671 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 849 మంది మరణించారంటే కరోనా తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 14,60,495 మంది కోలుకోగా, 16,94,620 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

అమెరికాలోని ఎనిమిది రాష్ర్టాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అలస్కా, జార్జియా, ఇడాహో, లూసియానా, మోంటానా, ఒహియో, ఉటా, విస్కాన్సిన్‌ రాష్ర్టాల్లో నిన్న రికార్డుస్థాయిలో కేసులు నమోదయ్యాయి.  

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,26,16,579 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,62,039 మంది మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 2,36,918 కరోనా కేసులు నమోదవగా, 5416 మంది మరణించారు.


logo