న్యూయార్క్, జూన్ 3: భారత్‌పై యూఎస్ మళ్లీ టారిఫ్ బాంబులు వేయడానికి రెడీ అవుతున్నది. ఇండియా-యూఎస్ మధ్య ప్రస్తుతం ట్రేడ్ డీల్ మీద చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ టారిఫ్‌లు వేసేందుకు యూఎస్ సిద్ధమవుతున్నది.
వెట్టిచాకిరీని నిర్మూలించడంలో ప్రపంచ వ్యాప్తంగా 54 దేశాలు ఫెయిల్ అయ్యాయని ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10 నుంచి 12.5 శాతం సుంకాలు విధించాలని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) ప్రతిపాదించింది. ఈ 54 దేశాల్లో ఇండియాతో పాటు యూకే, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, ఇజ్రాయెల్, సౌదీ మరికొన్ని దేశాలున్నాయి.