Turbulence | అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో తలెత్తుతున్న సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం (Delta flight) గగనతలంలో భారీ కుదుపులకు (Turbulence) గురైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు (passengers) గాయపడ్డారు.
డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన DL56 విమానం బుధవారం సాల్ట్ లేక్ సిటీ (Salt Lake City) నుంచి ఆమ్స్టర్డామ్ (Amsterdam)కు బయల్దేరింది. ఈ క్రమంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో దాదాపు 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇక పైలట్ విమానాన్ని మినియాపొలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో 275 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందించింది. కుదుపులకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
రెస్టారెంట్ మెనూలో సాల్ట్ వార్నింగ్!
భారత్‌లో మరిన్ని టెక్ లేఆఫ్‌లు.. ఏఐ, సిబ్బంది క్రమబద్దీకరణ ముప్పుపై నాస్కామ్ సంకేతం