Donald Trump | భారత్‌లో మరెవర్నో గెలిపించేందుకే ఆ నిధులు.. గత బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ ఆరోపణలు
Donald Trump | భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మునుపటి బైడెన్ సర్కారు 21 మిలియన్ డాలర్లు కేటాయించడం, తాజాగా ట్రంప్ సర్కారు వాటిని నిలిపివేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Donald Trump | భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా ప్రభుత్వం అందజేసే 21 మిలియన్ డాలర్లను ఇక నుంచి నిలిపివేస్తున్నట్టు ట్రంప్ (Donald Trump) యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్ (Elon Musk) నేతృత్వంలోని డోజ్ (DOGE) విభాగం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిధులు నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు. ఈ మేరకు గత బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధులతో అక్కడున్న ‘మరెవరి’ గెలుపు కోసమో బైడెన్ పనిచేశారని ఆయన ఆరోపించారు. బుధవారం రాత్రి మియామిలో నిర్వహించిన ఎఫ్ఐఐ ప్రియారిటీ సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిధుల అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు 21 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలి? అని ప్రశ్నించారు. ఆ దేశం (భారత్‌ను ఉద్దేశించి)లో మరెవర్నో గెలిపించేందుకు వారు (బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ప్రయత్నించినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. అదే కీలక ముందడుగు అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్ వద్ద చాలా డబ్బు ఉంది..
కాగా, నిధుల నిలిపివేత అంశంపై అంతకుముందు ఫ్లోరిడాలోని తన నివాసమైన మార్ ఎ లాగోలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయని.. అలాంటప్పుడు ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకు చేయాలంటూ ప్రశ్నించారు. తనకు భారత ప్రజలు, ప్రధాని పట్ల ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ‘భారత్‌కు 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి..? వారివద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పన్ను విధించే దేశాల్లో భారత్ ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. సుంకాల విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను చేరుకోలేదు. కానీ, వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మాత్రం మనం 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలా..? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఏంటి..?’ అంటూ ట్రంప్ ప్రశ్నించారు.
Also Read..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్‌లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

