Donald Trump |ఫ్లోరిడా, ఫిబ్రవరి 19: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరి పూర్తిగా మారుతున్నది. ఇంతకాలం యుద్ధానికి రష్యానే కారణమని ఆరోపిస్తూ, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న అగ్రరాజ్యం ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్నది. యుద్ధానికి ఉక్రెయినే కారణమని మంగళవారం ఫ్లోరిడాలోని తన నివాసంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ మండిపడ్డారు. ‘నువ్వు(ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ) యుద్ధాన్ని ప్రారంభించి ఉండాల్సింది కాదు. ఇందుకు బదులుగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఉండాల్సింది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అనుకుంటున్నానని, ఇది అర్థం లేని యుద్ధమని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉండిఉంటే అసలు యుద్ధమే జరిగి ఉండేది.
తనపై డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. రష్యా వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచారంలో ట్రంప్ జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.