Donald Trump | రెండోసారి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వేలాది మంది వలసదారులను గుర్తించి తమ దేశాలకు పంపించేశారు. ఈ క్రమంలో వలసదారులకు (immigrants) ఓ అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. అమెరికా పౌరసత్వం (US Citizenship) పొందడానికి వలసదారుల కోసం ‘బిగ్ బాస్’ తరహాలో ఓ రియాలిటీ షోను ఏర్పాటు చేస్తున్నట్లు (US plans reality show) తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం పరిశీలనలో ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా వెల్లడించింది.
పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన ఇంకా ఆమోదం కానీ, తిరస్కరణ కానీ పొందలేదని తెలిపారు. ఈ ప్రతిపాదిత రియాలిటీ షో ఎల్లిస్ ఐలాండ్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు అమెరికా మీడియా తెలిపింది. ఈ షోలో పాల్గొనే వలసదారులు అమెరికాపై తమ దేశభక్తిని, నిబద్ధతను చాటుకునేందుకు వివిధ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో గోల్డ్ రష్, కార్ అసెంబ్లీ వంటి టాస్క్‌లు, అమెరికా చరిత్ర, సంస్కృతిపై పరీక్షలు ఉండొచ్చని సమాచారం. ఈ షోలో ఎపిసోడ్‌కు ఒకరిని చొప్పున ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. చివరి విజేతకు అమెరికా పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది.
Also Read..
Ceasefire | భారత్-పాక్ మధ్య కోపం మంచిది కాదు: డొనాల్డ్ ట్రంప్
Donald Trump | ఎన్నారైలపై ట్రంప్ బాదుడు.. స్వదేశాలకు పంపే డబ్బుపై 5 శాతం ట్యాక్స్!
Donald Trump | అమెరికా సుప్రీంకోర్టు తీర్పును ఖండించిన ట్రంప్.. ఎందుకంటే..!