Ceasefire వాషింగ్టన్, మే 16: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తామే మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పునరుద్ఘాటించమే కాక, అది అతి పెద్ద విజయంగా అభివర్ణించారు.
గల్ఫ్ పర్యటన అనంతరం వాషింగ్టన్ చేరిన ఆయన ఇరుగు పొరుగు వారి మధ్య ఆ స్థాయి కోపం మంచిది కాదని అన్నారు. ‘జరిగిన దానితో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నాను. పరిస్థితి ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది చాలా పెద్ద విజయం. ఇద్దరి మధ్య కోపం స్థాయి చూశా. ఇది ఎంతమాత్రం మంచి విషయం కాదు’ అంటూ పేర్కొన్నారు.