Donald Trump | ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్‌కు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని (Gaza hostage release) స్పష్టం చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు.
కాగా, హమాస్‌కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని (Gaza hostage release) అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేదంటూ నరకం చూస్తారని, గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం దాదాపు 200 మందికిపైగా ప్రజలను హమాస్ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా కొందరిని విడుదల చేసింది. బంధీల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 51 మంది సజీవంగా ఉన్నారు.
Also Read..
Elon Musk | ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి.. జనాభా తగ్గుదలపై ఎలాన్ మస్క్ ఆందోళన
Justin Trudeau | అమెరికాలో విలీనమవడం అసాధ్యం.. ట్రంప్ ప్రతిపాదనపై ఘాటుగా స్పందించిన ట్రూడో
Earthquake | వణికిపోయిన టిబెట్.. 24 గంటల్లో 20 సార్లు కంపించిన భూమి