Earthquake | టిబెట్ (Tibet)ను భారీ భూకంపం (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. నేపాల్, భారత్ సహా చైనాలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ముందుగా ఉదయం 6:30 గంటలకు 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత రిక్టరు స్కేలుపై 4 తీవ్రతతో పలుమార్లు భూమి కంపించింది. 24 గంటల్లోనే కనీసం 20 సార్లు ప్రకంపనలు (20 earthquakes in 24 hours) నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, టిబెట్ ప్రాంతంలో నిత్యం భూ ప్రకంపనలు చోటు చేసుకుంటుంటాయి. గతేడాది కనీసం 3 తీవ్రతతో వందసార్లు భూమి కంపించింది. అయితే, ఈ స్థాయిలో ప్రకంపనలు (7 తీవ్రతతో) రావడం చాలా అరుదు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కేవలం తొమ్మిది మాత్రే అధిక స్థాయిలో ప్రకంపనలు నమోదైనట్లు తెలిసింది.
ఇక మంగళవారం సంభవించిన భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 126 మంది ప్రాణాలు కోల్పోయారు. 400 మంది గాయపడ్డారు. వాహనాలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం టిబెట్ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
Earthquake | వందకు చేరువలో భూకంపం మృతుల సంఖ్య.. 130 మందికి గాయాలు
President Xi Jinping: చైనాలో భూకంపం.. రెస్క్యూ ఆపరేషన్‌కు దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు