Earthquake | టిబెట్‌ను భారీ భూకంపం (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ తర్వాత స్వల్ప తీవ్రతతో పలుమార్లు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా ఈ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య వందకు చేరువైంది.
Thirty-two people have been confirmed dead and 38 injured during the 6.8-magnitude earthquake that jolted Dingri County in the city of Xigaze in Xizang Autonomous Region on Tuesday. #quake pic.twitter.com/YMDO6cBuAK
— China Xinhua News (@XHNews) January 7, 2025
ఇవాళ ఉదయం కేవలం గంట వ్యవధిలోనే టిబెట్ ప్రాంతంలో ఆరుసార్లు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. పెను భూకంపం ధాటికి ఇప్పటి వరకూ 95 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 130 మంది గాయపడ్డారు.
నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన మానిటరింగ్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రతను 6.8గా పేర్కొన్నది. టిబెల్ రాజధాని లాసాకు సుమారు 380 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. అనంతరం షిజాంగ్ ప్రాంతంలోనే మరో రెండుసార్లు భూమి కంపించిందని, వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7, 4.9గా నమోదయిందని వెల్లడించింది.
భూకంప తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. ఢిల్లీ ఎన్సీఆర్, బెంగాల్, బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపణలు సంభవించాయి. బీహార్‌లో ఆందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఇక చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది. భారీ భూకంపం ధాటికి పలుచోట్ల ఎత్తైన భవనాలు నేలకూలాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంటోంది.
Also Read..
Earthquake | టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం.. 53 మంది మృతి..!
President Xi Jinping: చైనాలో భూకంపం.. రెస్క్యూ ఆపరేషన్‌కు దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు
Earthquake: టిబెట్ కేంద్రంగా భూకంపం.. చైనాలో 9 మంది మృతి
Earthquake | నేపాల్‌లో భారీ భూకంపం.. ఉత్తర భారతంలోనూ ప్రకంపణలు