బీజింగ్: టిబెట్ కేంద్రంగా సంభవించిన భూకంపంలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(President Xi Jinping).. రెస్క్కూ ఆపరేషన్ చేపట్టేందుకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వాయవ్య చైనాలోని జీజాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. ఆ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదు అయ్యింది. చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ అయిన జీ జిన్‌పింగ్.. తన ఆదేశాల్లో మిలిటరీకి సూచనలు చేశారు. గాయపడ్డవారికి చికిత్స అందించాలన్నారు. భూకంపతో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని, సెకండరీ డిజాస్టర్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత వ్యక్తులను సరైన రీతిలో రీసెటిల్ చేయాలన్నారు. ఎర్త్‌కేక్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు.
భూకంపం వల్ల ఇప్పటి వరకు 53 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 62 మంది గాయపడ్డారు. తీవ్ర స్థాయిలో వచ్చిన భూకంపం వల్ల.. నేపాల్ రాజధాని ఖాట్మాండులో ప్రకంపనలు నమోదు అయ్యాయి. అనేక మంది ఇండ్ల నుంచి రోడ్డు మీదకు పరుగులు తీశారు. 2015, ఏప్రిల్ 25వ తేదీ నేపాల్ కేంద్రంగా భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. 7.6 తీవ్రతతో వచ్చిన ఆ నాటి భూకంపంలో వేలాది మంది నేపాలీలు మరణించారు.