Donald Trump : తనను తాను శాంతి దూతగా ప్రకటించుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పుతిన్ తీరు మారకపోవడంతో కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ఆయన తెలిపారు. శాంతి ఒప్పందానికి 50 రోజుల గడువు ఇచ్చిన ట్రంప్ తాజాగా 12 రోజుల డెడ్‌లైన్ విధిస్తున్నట్టు పేర్కొన్నారు.
‘పుతిన్ తీరుతో తీవ్ర నిరాశ చెందాను. ఆయన చాలా అందంగా మాట్లాడతారు. కానీ, రాత్రి పూట మాత్రం జనాలపై బాంబులతో దాడికి దిగుతారు. అందుకే.. ఇంతకుముందు ఆయనకు ఇచ్చిన 50 రోజుల గడువును కుదిస్తున్నా. వచ్చే 10 లేదా 12 రోజుల్లో పుతిన్ రాజీకి రావాలి. లేదంటే సెకండరీ ఆంక్షల్ని ఎదుర్కోక తప్పదు. వంద శాతం చెబుతున్నా ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విషయాన్ని నేను ఈ రోజు రాత్రి లేదా రేపు అధికారిక ప్రకటనతో వెల్లడిస్తాను’ అని ట్రంప్ రష్యా అధ్యక్షుడిని హెచ్చరించారని బీబీసీ కథనం పేర్కొంది.
🚨MAJOR BREAKING: Donald Trump LIES and says he was not briefed on the Epstein files – contradicting HIMSELF just 10 days ago when he said he was briefed.
Does Trump think MAGA is stupid or is he just the dumbest president to ever live? 🤡— CALL TO ACTIVISM (@CalltoActivism) July 25, 2025
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ రష్యా – ఉక్రెయిన్ల మధ్య సయోధ్య కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ఇరుదేశాల అధ్యక్షులను విడివిడిగా వైట్‌హౌస్‌కు రప్పించి మాట్లాడిన ఆయన సఫలీకృతం కాలేకపోయారు. జెలెన్స్కీ వెనక్కి తగ్గాలనుకున్నా.. పుతిన్ ససేమిరా అంటున్న వేళ ఆంక్షల మంత్రతో రష్యాను ఒప్పించాలని ట్రంప్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేశంతో చమురు ఒప్పందం చేసుకొనే దేశాలపై టారీఫ్స్ విధిస్తామని.. తద్వారా రష్యాను దెబ్బకొట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే.. ఆయన అస్త్రం ఏమేరకు ఫలితాన్నిస్తోందో చూడాలి.